మీడియా పవర్, అనకాపల్లి: పేదలకు సంక్షేమ పథకాలతో రాజమార్గము వేసి ప్రజల అభ్యున్నతే లక్ష్యం గా సీఎం జగన్ పాలిస్తున్నారని గ్రామీణాభిృద్ధి శాఖ మంత్రి ముత్యాలనాయుడు అన్నారు. సింగన్న దొరపాలెం గ్రామం, కె.కోటపాడు మండలంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తొలుత కొదండ రాముని ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ముందుకు సాగి స్థానిక నాయకులతో కలసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
పౌష్టికాహార వారోత్సవాలు
అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న పౌష్టికాహార వారోత్సవాలలో భాగంగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన పిల్లలకు అందిస్తున్న ఆహార పదార్ధాలను పరిశీలించారు. అనంతరం పిల్లలతో సరదాగా కాసేపు గడిపారు.
సమస్యలు పరిష్కారం
ఎక్కడికక్కడ గ్రామస్థులతో మమేకమౌతూ వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఇప్పటికే గ్రామం లోని ప్రధాన సమస్యలను మంత్రి స్వయంగా గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చేశారు. పేరుకుపోయిన డ్రైనేజీలలోని చెత్తలను త్వరితగతిన తొలగించమని అదేశించారు. అసంపూర్ణంగా ఉన్న నిర్మాణాలను పరిశీలించి నిర్మాణ పనులు త్వరితగతిని పూర్తి చేయాలని సదరు శాఖల అధికారులను ఆదేశించారు. గ్రామానికి సంబంధించిన అత్యవసర నిర్మాణ పనుల నిమిత్తం 20 లక్షల రూపాయలను మంజూరు చేశారు.ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను గుర్తించి వాటిని పునఃవ్యవస్థీకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనురాధ, ఎంపిపి రెడ్డి జగన్ మోహన్, ఎమ్మార్వో, ఎంపిడిఒ, మండల, గ్రామ స్థాయి అధికారులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
