కిరాణా సరుకులు అందచేత
మీడియా పవర్,శ్రీకాకుళం: కవిటి మండలం , బెజ్జిపుట్టుగ గ్రామానికి చెందిన యర్ర సుధాకర్ మృతి పట్ల సహచర పూర్వ విద్యార్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా మూత్ర వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు.విషయం తెలుసుకున్న బొరి వంక ఉన్నత పాఠశాల (1989 సంవత్సర పదవ తరగతి బ్యాచ్ విద్యార్ధులు సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్నేహితుడు మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. సుధాకర్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు.మిత్రులంతా సమకూర్చిన పదివేల ఐదు వందల రూపాయలు, సుమారు ఐదు వేల రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకులు పూర్వ విద్యార్ధి ఎంపిపి పూడి నేతాజీ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. పూర్వ విద్యార్థులు హరి,షణ్ముఖ గోపాలకృష్ణ లు సుధాకర్ కుమారుడికి అందజేశారు. సహచర పూర్వ విద్యార్ధి శివ ప్రసాద్ పిలుపుకు స్పందించిన మిత్రులంతా కలసి సుదాకర్‌కు ఇర్థక చేయుత అందించాడం అభినందనీయం. ఈ కార్యక్రమం లో లక్ష్మణ్ జెన్నా చిరంజీవులు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. ఇటీవలే జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం లో సుధాకర్ కు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 10వేల రూపాయలు అందించడం జరిగిందన్నారు. మిత్రుని కోసం ఈ విధంగా స్పందించిన 1989 విద్యార్థిని విద్యార్థులందరికీ నేతాజీ కృతజ్ఞతలు తెలిపారు.
