ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టంగా అమలు చేయాలి...జి ఎన్ శర్మ

MEDIA POWER
0

మీడియా ప‌వ‌ర్‌, పుట్టపర్తి, సెప్టెంబర్ 12: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్ఠంగా అమలు చేయాలని జాతీయ ఆహార భద్రత చట్టం పర్యవేక్షణ కమిటీ సభ్యుడు జి ఎన్ శర్మ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ఆహార భద్రత మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ పై సంబంధిత శాఖ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యుడు ఎమ్.ఎల్.చిప్పా, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద అందించి నాణ్యమైన బియ్యాన్ని దారిద్యరేఖ‌కు దిగువన ఉన్న కుటుంబాలకు అందించాలని తెలిపారు. అలాగే పీఎం గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద ఉచిత బియ్యాన్ని సరఫరా చేయాలని తెలిపారు.మండల స్థాయిలో, తహసీల్దార్లు సరసమైన ధరల దుకాణాల ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థలో అవసరమైన వస్తువుల పంపిణీని పర్యవేక్షించి మరియు అర్హులైన వారందరికీ దీపం పథకం కింద ఎల్‌పిజి కనెక్షన్ల మంజూరు చేయాలన్నారు. ఆహార పంపిణీ కార్డుదారులకు చౌక ధరల దుకాణాల ద్వారా సబ్సిడీ రేటుతో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద బియ్యం, గోధుమ, చక్కెర, కిరోసిన్, కార్డుల జారీ, వినియోగదారులకు అవసరమైన వస్తువుల ధరల పర్యవేక్షణ, బిపిఎల్ మహిళలకు ఎల్పిజి కనెక్షన్ల పంపిణీ (దీపం పథకం) మొదలైనవి నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో మూడు రోజులు పర్యటనలో ప్రజలు బాగా ఆదరించారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై మేనేజర్ కె అశ్వర్థ నారాయణ, డి ఈ ఓ మీనాక్షి, సాంఘిక సంక్షేమ అధికారి శివలింగ ప్రసాద్, గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రావు, సంబంధిత అధికారులు, డీలర్లు, తూనికల కొలతల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మూలం: (డిఐపిఆర్ ఓ, సమాచారం పౌర సంబంధాల శాఖ.. శ్రీ సత్య సాయి జిల్లా...పుట్టపర్తి)

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">