తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ కొనసాగాలని ఆ ఉత్తర్వులో తెలిపింది. ఢిల్లీలోని ఏపీ భవన్లో రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాలను 2017 మేలో టీటీడీ 25వ ఈవోగా డిప్యూటేషన్‌పై తీసుకువచ్చారు. టీటీడీ ఈవోగా రెండేళ్ల డెప్యుటేషను 2019లో ఏడాదిపాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి డిప్యూటేషన్‌ను పొడిగిస్తూ, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ టీటీడీ ఈవోగా కొనసాగాలని స్పష్టం చేసింది. కాగా టీటీడీ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు గత కొన్ని రోజులుగా టీటీడీ ఈవో సింఘాల్ ని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పిస్తున్నా తరుణంలో వైసీపీ ప్రభుత్వం సింఘాలను టీటీడీ ఈవోగా కొనసాగాలని మరోసారి ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. టీడీపీ హయాంలో నియమితులైనా, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలోనూ ఈవోగా సింఘాల్ కొనసాగడం వెనుక అయన పనితీరును గుర్తించక తప్పదు.
Post a Comment
0Comments
3/related/default