సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి కాకాణి

MEDIA POWER
0

నెల్లూరు, మీడియా పవర్, సెప్టెంబర్ 5 : నెల్లూరు పెన్నా బ్యారేజ్,  మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి నేడు జాతికి అంకితం చేయనున్నామని, సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు నగర, ఆత్మకూరు శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి విక్రమ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి నెల్లూరు పెన్నా బ్యారేజ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ల‌ను, కోవూరు,  సంగం హెలిప్యాడ్ లను, సంగంలో బహిరంగ సభ ప్రదేశాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు పెన్నా, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ల ప్రారంభంతో మరికొన్ని గంటల్లోనే జిల్లాలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుందని, దశాబ్దాల రైతుల కలను ముఖ్యమంత్రి నెరవేర్చనున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ రెండు బ్యారేజి లను ఆయన తనయుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించడం శుభపరిణామమన్నారు. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో కాటన్ దొర తర్వాత నీటి ప్రాజెక్టుల గురించి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. సీఎం పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టామని, పెన్నా బ్యారేజ్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి విగ్రహం, పైలాన్ ఆవిష్కరణ అనంతరం పెన్నా బ్యారేజ్ గేట్లు ఎత్తి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బ్యారేజ్ ను ప్రారంభిస్తారన్నారు. అలాగే సంగంలోని మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ వద్ద దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి, దివంగత మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాలు, పైలాన్ ఆవిష్కరిస్తారని, తదుపరి బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారన్నారు. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. నెల్లూరు నగర శాసనసభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పనులు పూర్తి కాలేదని కావాలనే తెలుగుదేశం నేతలు ఆరోపణలు చేస్తున్నారని, తమ హయాంలో బ్యారేజ్ ను ప్రారంభించడం ఓర్వలేకనే   ప్రచారాలు చేస్తున్నారన్నారు. బ్యారేజ్ వద్ద అన్ని పనులు పూర్తయ్యాయని, ఒక దిష్టిబొమ్మ మాత్రమే కట్టాలని ఎద్దేవా చేశారు. 150 ఏళ్ల అన్నదాతల కలలను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చుతున్నారని కొనియాడారు. ఈ రెండు బ్యారేజ్ లను ప్రారంభించడం తమ ప్రభుత్వ ఘనతగా చెప్పారు.  ఈ పర్యటనలో తెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ శ్రీ బాపిరెడ్డి, ఏ ఎస్ పి శ్రీమతి హిమవతి, చీఫ్ ఇంజనీర్ శ్రీ హరి నారాయణ రెడ్డి, సోమశిల ఎస్ఈ శ్రీ వెంకటరమణారెడ్డి, డి ఆర్ డి ఎ, డ్వామా పీడీలు శ్రీ సాంబశివారెడ్డి, శ్రీ వెంకట్రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి ధనలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి,నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీవోలు శ్రీ మలోల, శ్రీమతి కరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">