భూమి ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం - టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి

MEDIA POWER
0

 

➤ అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు.

➤160 ఎకరాలలో 100 కోట్లతో 6216 జగనన్నఇల్లు

మీడియా ప‌వ‌ర్‌, విశాఖ‌ప‌ట్నం, సెప్టెంబర్ 13: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయడం జరిగిందని టీటీడీ చైర్మన్  వై వి సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పెందుర్తి నియోజకవర్గం , పెదగంట్యాడ మండలం,  నడుపూరు వద్ద  జీవీఎంసీ లేఔట్ 160 ఎకరాలలో 100 కోట్లతో నిర్మించనున్న 6216 జగనన్న ఇళ్లకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి , పెందుర్తి ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదీప్ రాజు,  జిల్లా కలెక్టర్ డా. ఏ.మల్లికార్జునలతో కలిసి భూమి పూజ చేసిన‌ టిటిడి  చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ  దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరం లోనే అమలు చేసిన దాఖలాలు లేవని , మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే నెరవేర్చారని అన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎక్కడా అవినీతికి తావు లేకుండా నేరుగా ల‌బ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నారని తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు నిర్మించటం,  వీటన్నిటితోపాటు నాడు - నేడు కింద పూర్తిగా ఆధునీకరించే కార్యక్రమం కూడా రాష్ట్రవ్యాప్తంగా  అమలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులకు కూడా భద్రత కల్పించే విధంగా  ఒక్కొక్క ఎకరాకి 900 చ.గ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. హామీ ఇచ్చిన మేరకు ప్లాట్ పూర్తిగా అభివృద్ది చేసి రైతులకు త్వరగా అందజేయాలని  జిల్లా కలెక్టర్ కు సూచించారు.

గాజువాక ఎమ్మెల్యే  తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గత పాలకులు కేవలం హామీలు మాత్రమే ఇచ్చారని, కానీ ఇప్పుడు వాస్తవ రూపంలో అర్హులైన ప్రజలందరికీ ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందని, ఇది లబ్ధిదారులకు అత్యంత విలువైన ఆస్తి అని పేర్కొన్నారు.

పెందుర్తి ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదీప్ రాజు మాట్లాడుతూ నిరుపేద లందరికీ ఇళ్ళు కట్టించాలనేదే ఈ ప్రభుత్వ ధ్యేయమని,  ఈ రోజు ఇక్కడ అర్హులైన వారికి జీవీఎంసీ పరిధిలో ఉన్న భూములు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. కులం,మతం, వర్గం, రాజ‌కీయ‌పార్టీ వంటివి  చూడ‌కుండా ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరికీ మంజూరు చేయడం జరిగిందన్నారు . 

జిల్లా కలెక్టర్ డా. ఏ. మల్లికార్జున మాట్లాడుతూ ముఖ్యమంత్రి సుమారు లక్ష ఇల్లు నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారని , అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సుమారు 160 ఎకరాల విస్తీర్ణంలో 6216 ప్లాట్లకు గానూ  అనుమతి పొందిన 4654 ప్లాట్లకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు .కేవలం ఇళ్ళు నిర్మించడమే కాకుండా  పార్కులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ , ఆసుపత్రుల నిర్మాణం కూడా జరుగుతుందన్నారు.

  ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ సూర్యకుమారి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ ,హౌసింగ్ సిబ్బంది ,రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మూలం: ఉపసంచాలుకులు, జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయం, విశాఖపట్నం.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">