మీడియా పవర్, విజయనగరం, సెప్టెంబరు 15: అక్టోబరు 9,10,11 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో, రాష్ట్రస్థాయి శాస్త్రీయ సంగీత, నృత్య పోటీలను నిర్వహిస్తున్నట్లు, మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపల్ ఆర్‌వి ప్రసన్నకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఆదేశాల మేరకు, జూనియర్, సీనియర్ విభాగాల్లో శాస్త్రీయ సంగీతం, భరత నాట్యం, కూచిపూడి నృత్య పోటీలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వయసు 10 - 20 సంవత్సరాలు ఉన్న వారు జూనియర్స్ గాను, 21-40 సంవత్సరాలు మధ్య ఉన్నవారు సీనియర్స్ గాను పరిగణించడం జరుగుతుందన్నారు. ఒక్కో అభ్యర్ధికి 10 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర (ఉమ్మడి జిల్లాలు)కు సంబంధించి క్వార్టర్ ఫైనల్స్ వరకు పోటీలు, ఈ నెల 26న ఉదయం 9 గంటలకు, మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్వార్టర్ ఫైనల్స్‌లో అర్హత పొందిన వారందరికీ, విజయనగరంలోని మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో ఈనెల 29న సెమీ ఫైనల్స్, 30న ఫైనల్ పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 24వ తేదీలోగా తమ దరఖాస్తులను అందజేయాలని ప్రిన్సిపాల్ కోరారు. ఇతర వివరాల కోసం కళాశాల ఫోన్ నెంబరు 08922-223751, మెయిల్ ఐడి mrgcmdvzm@yahoo.com కు సంప్రదించాలని సూచించారు.
విజయనగరం ఉత్సవాల సందర్భంగా ...రాష్ట్రస్థాయి శాస్త్రీయ సంగీత, నృత్య పోటీలు
September 15, 2022
0
Tags