ఉత్తరాంధ్ర అభివృద్దే జ‌గ‌న‌న్న ల‌క్ష్యం.... పీడిక రాజన్నదొర

MEDIA POWER
0


మీడియా ప‌వ‌ర్‌, పార్వతీపురం, సెప్టెంబర్ 14 : ఉత్తరాంధ్ర అభివృద్దే జ‌గ‌న‌న్న ల‌క్ష్యం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వెనుకబడిన ప్రాంతంగా ఉందని ఆయన అన్నారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా ఉండటం అవసరమని ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలని ఆయన పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలనేది ల‌క్ష్యం పెట్టుకునప‌నిచేస్తున్నార‌ని స్పష్టం చేశారు. పార్వతీపురంలో రూ.63.63 కోట్ల ఏఐఐబి నిధులతో మంజూరు చేసిన సమగ్ర తాగు నీటి పథకం నిర్మాణపనుల శంఖు స్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమగ్ర తాగునీటి పథకం ద్వారా తోటపల్లి రిజర్వాయరు నీటి వసతిని ఉపయోగించుకుని 12 వేల కుటుంబాలకు కొళాయి కనెక్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. 2047 సంవత్సరం నాటికి పట్టణ జనాభా నీటి అవసరాలకు సరిపోయే విధంగా ప్రాజెక్టును రూపకల్పన చేశార‌ని, రోజుకు కుటుంబానికి 135 లీటర్లు చొప్పున సరఫరా చేయుటకు, 63.88 కిలో మీటర్ల మేర పైపు లైన్ వేయ‌డానికి ప్రతిపాదించార‌ని తెతిపారు. ప్రస్తుతం పట్టణంలో 7,477 కొలాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ప్రభుత్వం మహిళల పక్షపాతి అని పేర్కొంటూ తాగు నీటి సమస్య కారణంగా గ్రామీణ మహిళలు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటారని అన్నారు. పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలోని ఈ సమస్య పరిష్కారానికి రూ.63.63 కోట్లుతో మంజూరు జరిగిందని ఆయన చెప్పారు. ఇంత మొత్తంతో తాగు నీటి ప్రాజెక్టులు గతంలో ఎప్పుడూ మంజూరు కాలేదని ఆయన తెలిపారు. జిల్లాలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ మున్సిపాలిటీలకు రూ.189 కోట్లు తాగు నీటికి మంజూరు చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. మహిళకు నీటి సమస్య ఉండరాదని ఆయన చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందించడం జరుగుతుందని ఈ అంశం గడప గడపకు మన ప్రభుత్వంలో అందరూ చెపుతున్నారని ఆయన వివరించారు. పట్టణ ప్రాంతంలో 85 శాతం, గ్రామీణ ప్రాంతాలలో 95 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాజన్న దొర అన్నారు. సంక్షేమ పథకాలలో భాగంగా రాష్ట్రంలో 20 కోట్ల మంది లబ్దిదారులకు రూ.2.70 లక్షల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతి పైసాను పేదలకు, సంక్షేమానికి ఖర్చు చేస్తోందని, అమలులో అవినీతి లేదని ఆయన పునరుద్ఘాటించారు.

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుట జరుగుతోందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ను ఇటుకా ఇటుకా పేర్చాం రాత్రికి రాత్రి విడిచి పెట్టామని అన్నారు. అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి కావాలని ముఖ్య మంత్రి ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. పార్వతీపురంలో వైద్య కళాశాల మంజూరు జరిగిందని, కురుపాంలో జెఎన్టియు కళాశాల ఏర్పాటు జరిగిందని ఆయన పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సస్యశ్యామలం కావాలని సాగు నీటి ప్రాజెక్టులను అభివృద్ధి పరచడం జరుగుతోందని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని విశాఖపట్నం ఆర్థిక రాజధాని  కావాల‌ని ఆయన పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేస్తామని ఆయన తెలిపారు. 

శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ ఎస్.వి.డి డిగ్రీ కళాశాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మార్చడం జరిగిందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాల, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు అయిందని ఆయన పేర్కొన్నారు. సమగ్ర తాగు నీటి పథకాన్ని ప్రభుత్వం మంజూరు చేయడం సంతోషదాయకం అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. 

పురపాలక సంఘం చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి మాట్లాడుతూ తాగునీటికి శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ వాకాడ నాగేశ్వర రావు, పురపాలక సంఘం వైస్ చైర్ పర్సన్ పి. రుక్మిణి, ఇందుకూరు గున్నేశ్వర రావు, మునిసిపల్ కమీషనర్ జె. రామ అప్పారావు, ప్రజా ఆరోగ్య శాఖ పర్యవేక్షణ ఇంజినీర్ , జిల్లా ఆరోగ్య శాఖ ఇంజినీర్ కె.జి.ఎన్. నరసింగ రావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">