మీడియా పవర్, నెల్లూరు, 12 సెప్టెంబర్ 2022 వివిధ సమస్యలపై ప్రజల వద్ద నుండే వచ్చే అర్జీలను నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మనాథ్ పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, డి.ఆర్.ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ తో కలసి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ధేశించిన గడువు లోపు పరిష్కరించాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలోతెలుగు గంగ స్పెషల్ కలెక్టర్ శ్రీ టి. బాపిరెడ్డి, డిఆర్డీఏ పిడి శ్రీ సాంబశివారెడ్డి, మెప్మా పిడి శ్రీ రవీంద్ర, డి.పి.ఓ శ్రీమతి ధనలక్షి, ఐసిడిఎస్ పిడి శ్రీమతి ఉమామహేశ్వరి, సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీమతి రమాదేవి, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ శ్రీమతి ఉషారాణి, జిల్లా బి.సి వెల్ఫేర్ అధికారి శ్రీ వెంకటయ్య, సర్వే భూరికార్డుల ఏడి శ్రీ హనుమాన్ ప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మూలం: జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి, నెల్లూరు
