జనవరి నుండి పింఛను పెంపు.. పీడిక రాజన్నదొర

MEDIA POWER
0


మీడియా ప‌వ‌ర్‌, పార్వతీపురం, సెప్టెంబర్ 12 : వచ్చే జనవరి నుండి వృద్ధాప్యపు పింఛను రెండు వందల ఏభై రూపాయలు పెరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పింఛను పెంపును ప్రకటించిన విష‌యాన్ని ఉప ముఖ్యమంత్రి గుర్తుచేసారు. సాలూరు మండలం ఖరాస వలస పంచాయతీ ఖరాసవలస,గుర్రపు వలస, కొమ్మాన వలస,కోదు కరక వలస గ్రామాల్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి సోమవారం పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హుషారుగా పాల్గొన్న రాజన్నదొర ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. కుటుంబాలకు అందుతున్న‌సంక్షేమ ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా గుర్రపువలస గ్రామంలో దింసా నృత్యంలో జత కలసి గిరిజ‌న సాప్ర‌దాయ నృత్యం చేసారు. కరాసవలస గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో బి.పి, షుగర్ ప‌రీక్ష చేసుకున్నారు. బి.పి, సుగర్ సాధారణ స్థాయిలో ఉన్నాయని వైద్య సిబ్బంది తెలిపారు. మామిడి వలస గ్రామంలో కేజిబివి పాఠశాలను సందర్శించి కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. చదువుతోనే సామాజిక, ఆర్థిక మార్పు సాధ్యమని తెలిపారు. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ దిశ‌గా ప్ర‌ణాళిక చేసుకుని ఆ దిశగా చదవాలని ఆయన సూచించారు. విద్యార్థి దశ ఒక వ్యక్తికి అత్యంత కీలకమైనద‌ని దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళ్యాణమస్తు కార్యక్రమం అమలుపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించగా అందులో ఉప ముఖ్యమంత్రి పాల్గొని ప్రభుత్వం ఒక ధృడ సంకల్పంతో పనిచేస్తుందని తెలిపారు. కళ్యాణ మస్తు కార్యక్రమం క్రింద లక్ష రూపాయల వరకు ఇస్తుండగా, కులాంత వివాహాలకు రూ.1.20 లక్షల వరకు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.

"కురుపాం శాసన సభ్యులు పాముల పుష్ప శ్రీ వాణి కురుపాం మండలం చెరువుకొమ్మ వలస గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌గా, పాలకొండ శాసన సభ్యులు విశ్వాసరాయి కళావతి భామిని మండలం నెరడి సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">